గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 జూన్ 2022 (19:29 IST)

నవ దంపతులది పరువు హత్య కాదు, ఎఫైర్ హత్య: పోలీసులు వెల్లడి

murder
కులాంతర వివాహం చేసుకున్న నవ వధువు తమిళనాడులోని కుంభకోణం సమీపంలో సోమవారం సాయంత్రం హత్యకు గురైంది. ఆమెతో పాటు ఆమె భర్తను కూడా హత్య చేసారు. ఈ జంట హత్యలకు పాల్పడిన వారు నవ వధువు సోదరుడు, ఆమె బంధువు. వీరిని అరెస్టు చేశారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవ వధువు ఇంతకుముందే హత్యకు పాల్పడ్డ బంధువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అతడిని దూరం పెట్టి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నందుకు పార్టీ ఇస్తాను రమ్మని నూతన దంపతులను పిలిపించాడు సోదరుడు. అప్పటికే ఆమె మాజీ ప్రియుడు, బంధువు మాటు వేసి వున్నాడు. వారు ఇంట్లోకి రాగానే ఆమె మాజీప్రియుడు, సోదరుడు ఇద్దరూ కలిసి హతమార్చారు.

 
మహిళ షెడ్యూల్డ్ కులానికి చెందినది కాగా ఆమె భర్త అత్యంత వెనుకబడిన కులానికి చెందినవారు. అయితే ఇది పరువు హత్య కేసు కాదని కొందరు అంటున్నారు. ఇది పరువు హత్య కేసు కాదు అని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

 
దాడి చేస్తున్న సమయంలో తన కుమార్తె  చావు కేకలు విన్న వధువు తల్లి పరుగున వచ్చి చూడగా కుమార్తె రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె భర్త కూడా అదే పరిస్థితిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.