మంగళవారం, 6 డిశెంబరు 2022
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 12 జూన్ 2022 (10:42 IST)

పనికి వెళ్లమన్న భార్య.. కత్తెరలతో చంపేసిన భర్త.. ఎక్కడ?

murder
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను పనికి వెళ్లమన్నందుకు ప్రాణాలు కోల్పోయింది. తనను పనికి వెళ్లమనడాన్ని జీర్ణించుకోలేని భర్త.. కట్టుకున్న భార్యను కర్కశంగా చంపేశాడు. ఈ దారుణం రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణానికి చెందిన విభోర్ సాహు (30) అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. పనిపట్ల భర్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇంట్లో సరుకులు నిండుకుంటుండటంతో భార్య రీతు (23) కలత చెందింది. దీంతో రోజూ పనికి వెళ్లాలంటూ భర్తను కోరింది. 
 
ఈ మాటతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సాహు.. భార్యపై రెండు కత్తెరలతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రీతు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన అనంతరం సాహు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
అంతకుముందు ఓ కార్యక్రమానికి వెళ్లిన సాహు తల్లి, సోదరుడు ఇంటికి వచ్చి చూడగా.. భార్యాభర్తలిద్దరూ రక్తపు మడుగులో పడిఉన్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.