బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (09:43 IST)

నా భార్య రమేష్ బాబుతో ఒకే గదిలో ఉండటాన్ని చూశా... నటి ఐశ్వర్య మాజీ భర్తపై కేసు

video
తన భార్య పారిశ్రామికవేత్త రమేష్ బాబుతో ఒకే గదిలో ఉండటాన్ని తాను చూశానని టీవీ సీరియల్స్ మాజీ భర్త శ్యామ్ కుమార్ ఆరోపణలు చేశారు. దీనికి రమేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యామ్ కుమార్‌పై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ కమలాపురికాలనీకి చెందిన వ్యాపారవేత్త రమేష్ బాబుకు మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల ద్వారా సీరియల్ నటి ఐశ్వర్య పరిచమయ్యారు. అయితే, 2023 సెప్టెంబరు ఆరో తేదీన ఐశ్వర్యకు శ్యామ్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఐశ్వర్య తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. 
 
ఈ క్రమంలో సెప్టెంబరు 26వ తేదీన రమేష్ బాబుకు శ్యామ్ కుమార్ ఫోన్ చేసి తనకు రూ.10 లక్షలు ఇవ్వకుంటే తన మాజీ భార్య ఐశ్వర్యతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. ఈ బెదిరింపులకు రమేష్ బాబు ఏమాత్రం లొంగలేదు. దీంతో శ్యామ్ కుమార్ అనుకున్నట్టుగా ఐశ్వర్యతో తాను ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ బాబు.. శ్యామ్ కుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.