గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (14:39 IST)

దర్శకుడు సూర్య కిరణ్ మృతికి మాజీ భార్యనే కారణం : కరాటే కళ్యాణి

ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సూర్య కిరణ్ మృతిపై సినీ నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్య కిరణ్ మరణానికి ఆయన మాజీ భార్య హీరోయిన్ కళ్యాణి కారణమని ఆరోపించారు. కళ్యాణిని సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆమె అతనికి దూరం కావడాన్ని సూర్యకిరణ్ జీర్ణించుకోలేక పోయాడని, ఈ కారణంగానే ఆయన మద్యానికి బానిసయ్యాడని చెప్పారు. ఫలితంగా పచ్చ కామెర్ల బారినపడటంతో ప్రాణాలు కోల్పోయాడని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. 
 
కామెర్లు సోకడంతో దర్శకుడు సూర్య కిరణ్ సోమవారం చెన్నైలో చనిపోయిన విషయం తెల్సిందే. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. అయితే, ఆయన మృతిపై కరాటే కళ్యాణి సంచలన విషయాలు వెల్లడించారు. భార్యతో విడాకులే సూర్యకిరణ్ దుస్థితికి కారణమన్నారు. 
 
హీరోయిన్ కల్యాణిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారని, తన భార్యను సూర్యకిరణ్ గుండెల నిండా నింపుకున్నాడని, ఆమె దూరం కావడంతో జీర్ణించుకోలేక పోయాడని అన్నారు. ఈ లోకంలో తనకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడని తెలిపారు. రాత్రంతా మందు, సిగరెట్లు తాగుతూ ఉండేవాడని, దీంతో ఆరోగ్యం దెబ్బతిందన్నారు. తాగుడు వల్లే ఆయనకు జాండిస్ వచ్చిందని... జాండిస్ కారణంగానే మృతి చెందాడని చెప్పారు.