శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (20:04 IST)

చిన్న చేపలు తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Fish
చిన్న చేపలు, పెద్ద చేపలు. ఏవి ప్రయోజనకరమైనవనే ప్రశ్న చాలామందిలో వుంటుంది. పోషకాహార నిపుణులు చెప్పేదేమిటంటే... పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివి అని చెబుతారు. వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చిన్న చేపల్లో క్యాల్షియం, విటమిన్ ఎ పుష్కలంగా వుంటాయి కనుక ఎముకలకు, కళ్లకు మేలు చేస్తాయి.
తక్కువ స్థాయిలో మెర్క్యురీ వుంటుంది కనుక ఇవి ఆరోగ్యానికి మంచిది.
చిన్న చేపల్లో మినరల్స్ వుండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బ్రెయిన్ పవర్‌ను పెంచే ఒమేగా 3 యాసిడ్స్ చిన్న చేపల్లో వుంటాయి.
చిన్న చేపల్లో కలుషితాల స్థాయి చాలా తక్కువ మోతాదులో వుంటుంది.
పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువ.