శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (10:32 IST)

వదిన - మరిది మధ్య వివాహేతర సంబంధం : చివరకు...

తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా దేవరకద్రలో వదిన, మరిది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిద్దిర మధ్య ఉన్న వివాహేతర బంధమే వారి ప్రాణాలను తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అర్చన (23) తన భర్త కుటుంబంలో వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
అయితే ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఒకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు మధు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.