ఒంటరిగా ఉన్న మహిళపై తుపాకీ ఎక్కుపెట్టి...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా నివశించే మహిళలను కొందరు కామాంధులు టార్గెట్ చేసుకున్నారు. ఇలాంటి మహిళలను గుర్తించి, తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఓ కామాంధుడు తుపాకీ ఎక్కుపెట్టి అత్యాచారం చేశాడు.
యూపీలోని జాలౌన్ జిల్లాలోని ఉరయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. భర్త పని నిమిత్తం వెళ్లాడు. ఆ సమయంలో నలుగురు యువకులు కలిసి గోడ దూకి ఇంట్లోకి వచ్చారు.
మహిళకు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించి సామూహిక లైంగికదాడికి తెగపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు విషయాన్ని తన భర్తకు తెలియజేయగా అతను హుటాహుటిన ఇంటికి చేరుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.