శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (09:08 IST)

బుధవారం తెల్లవారుజామున అండమాన్‌లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవరాం తెల్లవారుజామున 4.56 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతంలో భూప్రకంపనలు కనిపిచాయి. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 
 
దిగ్లీపూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో భూమిలో కదలికలు వచ్చాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.