గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (16:11 IST)

తాలిబన్ తీవ్రవాదుల రాక్షస క్రీడ ... గాల్లో కలుస్తున్న ప్రాణాలు

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అకృత్యాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. సుపరిపాలన పేరుతో రాక్షస క్రీడను కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆగడాలను ఆప్ఘన్ వాసులు తీవ్రవంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
తాజాగా అఫ్గన్‌ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. 
 
అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని ఆమెకు శిక్షణ ఇచ్చే కోచ్ ఒకరు తెలిపారు. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటివరకు నోరు మెదపలేదని వాపోయింది. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా  క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది.