బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (14:55 IST)

పీకల దాకా మద్యం తాగి, కడుపు నిండా బిర్యానీ తిని మహిళపై అత్యాచార యత్నం చేసిన విఆర్ఎ

వరంగల్ జిల్లాలో ఓ కామాంధుడి చేష్టకు మహిళ భీతిల్లిపోయింది. పొట్టకూటి కోసం బిర్యానీ హోటల్ నడుపుతున్న మహిళపై కామాంధుడు విరుచుకపడ్డాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఊరు శివార్లో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ హోటల్ కి రాత్రి 9 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన అశోక్ అనే విఆర్ఎ బిర్యానీ తినేందుకు వచ్చాడు. ఐతే అప్పటికే పూటుగా మద్యం సేవించి వున్న అశోక్, కడుపు నిండా బిర్యానీ తిని, ఆపై అశోక్ భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

 
ఆమెను సమీప పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఇంతలో బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో భర్త శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని అతడిని అడ్డుకున్నాడు. ఐతే తన కామాంధ కోర్కెను అడ్డుకున్న శ్రీనివాసరావు చేతి వేలు నోట్లో పెట్టుకుని కొరికేసి అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.