గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (21:52 IST)

భర్తతో మద్యం మాన్పించేందుకు భార్య చేసిన పని చూస్తే విస్తుపోతారు..

liquor
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో కట్టుకున్న భర్తతో మద్యం మాన్పించేందుకు ఓ భార్య చేసిన పనిని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ విస్తుపోతారు. నిత్యం తాగి ఇంటికి వస్తున్న భర్తను తన దారికి తెచ్చుకునేందుకు ఆమె కూడా మద్యానికి బానిసైనట్టుగా నటించింది. పైగా, భర్తను చితకబాదసాగింది. భార్య వేధింపులు భరించలేదని భర్త.. తన ప్రాణాలు రక్షించాలని పోలీసులతో పాటు కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
భార్య కూడా తనలాగే మద్యానికి బానిస అయిందని భావించిన ఆ వ్యక్తి ఫ్యామిలీ కౌన్సిలింగ్‍‌ సెంటర్‌ను ఆశ్రయించారు. భార్య తాగిన మత్తులో వెంటపడి ఎలా కొడుతుందో చూడండి అంటూ ఓ వీడియోను కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బందికి చూపించాడు. దాంతో ఆ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది భార్యాభర్తలిద్దరితో మాట్లాడారు 
 
తాను భర్తతో మద్యం మాన్పించడానికే తాగుబోతులా నటిస్తున్నానని భార్య చెప్పడంతో వారంతా విస్తుపోయారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సెంటర్ వారు ఆ దంపతుల మధ్య ఒక ఒప్పందం కుదిర్చి ఇంటికి పంపించారు. తన భర్త వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం సేవించాలన్న షరతు పెట్టగా, అందుకు భార్య కూడా సమ్మతించింది. మరీ ముఖ్యంగా, మద్యం సేవించిన తర్వాత భార్యతో గొడవ పెట్టుకోరాదని, వాగ్వాదానికి దిగరాదని వారు సూచించారు.