శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (19:28 IST)

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ భార్య కారును వెంబడించిన యువకులు.. ఎందుకు?

KKR Captain
KKR Captain
ఐపీఎల్ క్రికెట్ సిరీస్ జరుగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సచి మార్వా ప్రయాణించిన కారును వెంబడించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 16వ సీజన్ క్రికెట్ జరుగుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై కింగ్స్ సహా 10 జట్లు పాల్గొంటున్నాయి. 
 
ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా భార్య సచి మార్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె ప్రయాణిస్తున్న కారును బైక్‌లపై కొందరు వెంబడించారు. వాళ్లు తన కారును ఎందుకు అనుసరించారో తెలియదని.. గత శనివారం రాత్రి కీర్తి నగర్‌లో ఈ ఘటన జరిగిందని, క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.
 
ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా.. దీనిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఈ కేసులో ప్రమేయమున్న ఇద్దరు యువకులు సాయితనయ శివం (18), వివేక్ (18)లను గుర్తించి విచారిస్తున్నట్లు తెలిపారు.