గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (17:55 IST)

కమ్మలు విక్రయించి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య.. ఎక్కడ?

murder
తెలంగాణ రాష్ట్రంలో ఓ కసాయి భార్య.. కట్టుకున్న భర్తను కడతేర్చింది. కిరాయి మూకలకు డబ్బులు ఇచ్చేందుకుతన వద్ద ఉన్న కమ్మలను విక్రయించి సుపారీ ఇచ్చి, ఈ దారుణానికి ఒడిగట్టింది. సుపారీగా రూ.2 లక్షలు ఇవ్వడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,
 
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందల్వాయి అనే గ్రామంలో గోపాల్, పీరుభాయి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిసకావడంతో సాయంత్రానికి మద్యం సేవించి ఇచ్చి భార్యను చిత్ర హింసలకు గురిచేయసాగాడు. భర్త వేధింపులకు విసిగిపోయిన ఆమె... భర్త పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ క్రమంలో చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, వీరికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చేలా డీల్ మాట్లాడుకుంది. వారిద్దరూ పన్నిన పథకం ప్రకారం గత నెల 30వ తేదీన గోపాల్‌ను కిరాతకంగా హత్య చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భార్యే ఈ హత్యకు సూత్రధారిగా తేలింది. సుపారీ ఇచ్చేందుకు తన వద్ద ఉన్న కమ్మలు విక్రయించి రూ.2 లక్షలు చెల్లించినట్టు విచాలణలో వెల్లడైంది. దీంతో పీరుబాయితో పాటు గోపాల్, చందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్స్, ఓ బైకు, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.