శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: బుధవారం, 16 నవంబరు 2016 (16:00 IST)

కూర్పు కోటీశ్వ‌రుల‌కు... మార్పు సామాన్యులకా? కోట్ల బ‌కాయిల వసూలెపుడు మోదీ గారూ...?

న్యూఢిల్లీ: న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేశాం. ప్ర‌జ‌లు ఈ బాధ‌ను ఓర్చుకోవాలి. అంతా స‌ర్దుకుంటుంది... అంటూ కేంద్ర నాయ‌కులు ఓదార్పు మాట‌లు చెపుతున్నారు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం అస‌హ‌నం రోజురోజుకూ పెరిగిపోతోంది. న‌ల్ల ధ‌నం వెలి

న్యూఢిల్లీ: న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేశాం. ప్ర‌జ‌లు ఈ బాధ‌ను ఓర్చుకోవాలి. అంతా స‌ర్దుకుంటుంది... అంటూ కేంద్ర నాయ‌కులు ఓదార్పు మాట‌లు చెపుతున్నారు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం అస‌హ‌నం రోజురోజుకూ పెరిగిపోతోంది. న‌ల్ల ధ‌నం వెలికి తీయాలంటే, ఇలా సామాన్యుల‌ను ఇబ్బంది పెట్టాల్సిందేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. 
 
న‌ల్ల ధ‌నం స్విస్ ఖాతాల్లో దాచిన‌, బ్యాంకు రుణాలు దోచిన పెద్ద‌ల‌ను ఏమీ చేయ‌రా? మార్పు ఎప్పుడూ సామాన్యులే భ‌రించాలా? అని ఆక్రోశిస్తున్నారు. భార‌తదేశం మొత్తం మీద ఎవరెవరు బ్యాంకుల వద్ద నుండి ఎంత మొత్తం తీసుకొని తిరిగి చెల్లించటం లేదో వారిని ఎందుకు నిల‌దీయ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆర్.బి.ఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ రఘురాం రాజన్ దేశంలో మొండి బ‌కాయిల లిస్టును గ‌తంలోనే విడుదల చేసారు. ఇందులో అంబానీలు మొదలుకొని లిస్టు చాంతాడంత ఉంది. 
 
సహారా గ్రూప్ , విజయ మాల్యా , శ్రీ రేణుక సుగర్స్ , నవీన్ జిందాల్ , డిఎల్ ఎఫ్ ప్రాపర్టీస్ తోపాటు, 5 వేల కోట్లు అంత కన్నా తక్కువ చాలా మంది ఉన్నారు. మొత్తం కలుపుకొని 28 లక్షల కోట్లు మొండి బకాయిలున్నాయి. వీళ్లందరూ అప్పులు తిరిగి చెల్లించాలని జనవరిలో ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ నోటీసులు ఇచ్చారు. కానీ, ఎవ‌రిలో చ‌ల‌నం లేదు. రాజన్ అనుకొన్నది అనుకొన్నట్లు జరిగితే జూలై నెలలో వేలం పాటలు మొదలై ఉండాలి. ఆ సమయంలోనే ఈ పెద్ద వ్యాపారులు ఆర్.బి.ఐ గవర్నర్ రాజన్‌ని సాగ‌నంపి ఉర్జిత్ పటేల్‌ని ఆర్బీఐ గవర్నర్‌గా చేశారు. 
 
ఇదిలావుంటే తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 7 వేల కోట్లు మొండి బకాయిలు రద్దు చేసి ఇతర బ్యాంకులకు మార్గదర్శిగా నిలిచింది. మిగిలిన బ్యాంకులు కూడా రాని బాకీలు అంటూ బడా వ్యాపారవేత్తలు తీసుకున్న అప్పులను మాఫీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ డబ్బులన్నీ సామాన్యులవే కదా. ఇప్పుడేమో సామాన్యులను అవినీతి నిర్మూలన అంటూ రోడ్లపై నిలబెట్టేశారు. చేతిలో చిల్లగవ్వ లేక వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా సామాన్యుల‌ను క్షోభ పెట్టి మీరు సాధించేదేముంద‌ని దేశ ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.