సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (23:25 IST)

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

pawan kalyan at Kakinada port
కర్టెసి-ట్విట్టర్
కాకినాడ రైస్ మాఫియా ఆకాశమే హద్దుగా సాగుతుందా? స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీ చేసేందుకు వెళ్తేనే తనకు అధికారులు సహకరించలేదని విస్మయం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ట్విట్టర్లో Deputy CM ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యాపారాల్లో మాఫియా నడుస్తోందని గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెపుతూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖకి జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు. ఇక అప్పట్నుంచి అవినీతిని తిమింగలాలను పట్టుకునేందుకు ఆయన తిరుగుతూనే వున్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన భారీ అవినీతి తిమింగలం కాకినాడ పోర్టు ద్వారా బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న రైస్ మాఫియా.
 
ఈ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం గత కొన్నిరోజులుగా గట్టి చర్యలు తీసుకుంటుంది కానీ మాఫియా తన పని తను చేసుకుంటూ వెళ్తోంది. దీనితో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. శుక్రవారం నాడు ఆయన నేరుగా కాకినాడ పోర్టుకి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన అధికారులతో అంటున్న మాటలు చూసి మాఫియా ఏ స్థాయిలో వెళ్లూనుకున్నదో కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది.
 
డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ... దాదాపు ఆరు నెలల నుంచి పోర్టులో జరుగుతున్న బియ్యం రవాణా తనీఖీ చేయాలని అంటుంటే... 10 వేల మంది జీవితాలు నాశనమవుతాయ్ అంటున్నారు. పోర్ట్ వున్నది ఎందుకు.. స్మగ్లింగ్ చేసుకునేందుకా... ప్రజలు పన్నులు ద్వారా చెల్లించే డబ్బుతో బియ్యం కొంటుంటే... ఆ బియ్యానికి ఒక్క పైసా కూడా చెల్లించకుండా వేలకోట్లు ఆర్జిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఇది బియ్యంతో ఆగుతుందా...? మారణాయుధాలు, టెర్రరిస్టులు, డ్రగ్స్... అన్నింటికీ కేంద్రం కాదా? దీన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. సీజ్ ది షిప్, కేంద్రం నుంచి వత్తిడి వస్తే నేను మాట్లాడతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు పవన్ కల్యాణ్.
 
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సముద్రంలో 9 కిలోమీటర్లు మేర ప్రయాణించారు. తనకు పోర్టు అధికారులు నుంచి సహకారం లభించలేదనీ, పరిస్థితి ఇలా వున్నదంటే... మాఫియా ఏ స్థాయిలో వున్నదో అర్థమవుతోందని అన్నారు.