మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 8 ఏప్రియల్ 2017 (15:29 IST)

ప్లీజ్... గాలి తీయొద్దు... టిటిడి ఛైర్మన్ ఇస్తాగా...? ఎవరు..?

ఏపీలో కొత్త కేబినెట్ తరువాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. సీనియర్లందరూ అధినేతపై గుర్రుగా ఉన్నారు. మరికొందరైతే పార్టీని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకున్నారు. అందులో మొదటగా స్పందించింది చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బ

ఏపీలో కొత్త కేబినెట్ తరువాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. సీనియర్లందరూ అధినేతపై గుర్రుగా ఉన్నారు. మరికొందరైతే పార్టీని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకున్నారు. అందులో మొదటగా స్పందించింది చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. ఆ తరువాత మరో సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమనాయుడు. ప్రస్తుతం గాలి ముద్దుక్రిష్ణమనాయుడు పార్టీని వదిలి జనసేనలోని వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చారు.

ఇదే విషయంపై తన అనుచరులతో ఆయన సమావేశమైన నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఇప్పటికే బొజ్జల అలక పాన్పు ఎక్కితే దించలేని బాబు ప్రస్తుతం ముద్దుక్రిష్ణమనాయుడునైనా పార్టీలో ఉండే విధంగా చేసుకోవాలని చూస్తున్నారట. అందుకే ముద్దుక్రిష్ణమనాయుడు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం.
 
ఆయనకివ్వాలనుకుంటున్న పదవి టిటిడి ఛైర్మన్ పదవి అంట. ఈ నెల 27వ తేదీ నాటికి టిటిడి పాలకమండలి పదవీకాలం ముగిసిపోతుంది. ఆ తరువాత కొత్త పాలకమండలి ఛైర్మన్ అవసరం ఉంటుంది. ఆ పదవిని ముద్దుక్రిష్ణమనాయుడుకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట చంద్రబాబు. ఇదే విషయాన్ని నిన్న రాత్రి బాబు స్వయంగా ముద్దుక్రిష్ణమనాయుడుకు చెప్పారట. టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తాను.. ఎక్కడా పార్టీ గురించి మాట్లాడటం కానీ, పార్టీ మారడం గానీ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారట. అధినేత బుజ్జగించిన తరువాత గాలిముద్దుక్రిష్ణమనాయుడు ఏం చేస్తారు. సరేనని తలూపారట. 
 
మంత్రి పదవి కన్నా టిటిడి ఛైర్మన్ పదవి పవర్‌ఫుల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు ఇప్పటికే సినీ నటుడు మురళీమోహన్‌కు టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాటమారుస్తుండటం ఏ పరిణామాలు దారితీస్తుందోనని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. ప్రస్తుతానికి గాలి ముద్దుక్రిష్ణమనాయుడును అలకపాన్పు నుంచి కిందకు దించడానికి ఇది తప్ప వేరే దారి లేదనుకున్నట్లు చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.