హ్యాపీ డాటర్స్ డే: లింగ బేధం వద్దు.. వారికి అన్నీ సమకూర్చండి.. ఉన్నత శిఖరాలను..?
భారతదేశంలో, డాటర్స్ డే సెప్టెంబర్ 25, 2022న నిర్వహించబడుతుంది. ఈ రోజు లింగం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతపై అవగాహనను పెంచుతుంది. ఈ అసమానతలో విద్య, పోషకాహారం, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, వివక్ష, మహిళలపై హింస, ఉచిత బాల్య వివాహాల నుండి రక్షణ వంటి రంగాలు ఉన్నాయి.
ఈ దినోత్సవం బాలికలు, యువతుల విజయవంతమైన ఆవిర్భావాన్ని ప్రతిబింబిస్తుంది. అందుచేత కుమార్తెలతో సమయం గడపండి. వారి గొప్పతనాన్ని గుర్తించండి. వారికి తల్లిదండ్రులు అన్నీ సమకూర్చండి. నాణ్యమైన విద్య, పోషకాహారం, ధైర్యాన్ని నింపండి. సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు అవసరమైన అన్నీ వనరులను సమకూర్చండి. అప్పుడే డాటర్స్.. బాలికలు, యువతులు, మహిళలుగా ఈ సమాజానికి ఎంతో సేవ చేయగలుగుతారు.
"కుమార్తెలు మన హృదయాలను అంతులేని ప్రేమతో నింపడానికి నింగి నుంచి పంపబడిన దేవదూతలు" - J. లీ.
"నీకు ఎంత వయసొచ్చినా, నువ్వు నా చిట్టి తల్లిగానే ఉంటావు; నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రియమైన కుమార్తెకు.. హ్యాపీ డాటర్స్ డే"
"ప్రియమైన కుమార్తె, ఈ ప్రపంచంలోని అత్యంత అందమైన బహుమతులలో మీరు ఒకరు. అది ఎన్నటికి మారనిది. హ్యాపీ డాటర్స్ డే!"