బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (14:33 IST)

వైకాపాలోకి జయప్రద వస్తానంటే.. జగన్ వద్దంటారా..?

సినీనటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వైకాపాకు, వైకాపా నుంచి టీడీపీకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. జయప్రద వైకాపాలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ తరపున మరోసారి రాజ్యసభ టికెట్ దక్కించుకున్నారు. సమాజ్ వాది పార్టీలో ఆమె అమర్ సింగ్ మనిషిగా గుర్తింపు పొందారు. అయితే పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ మధ్య విభేదాలు రావడంతో జయప్రద సమాజ్ వాదీ పార్టీని వీడారు. 
 
అప్పటి నుంచి జయప్రద ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. అయితే సొంత రాష్ట్రంపై జయప్రద దృష్టిపెట్టారని.. అందుకే ఏపీ రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. సంస్థాగతంగా బలంగా లేని జనసేన కంటే వైసీపీలో చేరేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు టాక్ వస్తోంది. 
 
రాజమండ్రి లోక్ సభ స్థానం ఇవ్వాలని.. లేదంటే రాజ్యసభకు నామినేట్ చేయాలని జయప్రద కోరుతున్నట్లు టాక్ వస్తోంది. మరి జయప్రద వైకాపాలోకి వస్తానంటే.. ఆ పార్టీ చీఫ్ జగన్ వద్దంటారా.. అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.