శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 20 మార్చి 2018 (14:13 IST)

కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ.. ఎందుకో తెలుసా?

కలకత్తాలో మొక్కు తీర్చుకోవాలి అనుకున్న కేసీఆర్ పనిలో పనిగా థర్డ్ ఫ్రంట్ డ్రామా కూడా ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు. అందులో భాగంగానే అక్కడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. తన మందీ మార్బలంతో పశ్చిమ బెంగాల్ సెక్రటరియ

కలకత్తాలో మొక్కు తీర్చుకోవాలి అనుకున్న కేసీఆర్ పనిలో పనిగా థర్డ్ ఫ్రంట్ డ్రామా కూడా ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు. అందులో భాగంగానే అక్కడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. తన మందీ మార్బలంతో పశ్చిమ బెంగాల్ సెక్రటరియేట్‌కు చేరుకున్న గులాబీ బ్యాచ్‌ను  మమతా ఎదురు వచ్చి మరీ లోపలికి తీసుకెళ్లారు. కేసీఆర్ సార్‌ను మంచి చెడులు అడిగారు. ఆ తరువాత కెసిఆర్ చాలా పెద్ద ఉపన్యాసం ఇవ్వడం స్టార్ట్ చేశారు.
 
దేశానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏమీ చేయలేదు.. నేను మా రాష్ట్రంలో చాలా అభివృద్ధి చేశాను, రైతులకు చాలా పథకాలు తీసుకొచ్చాను అని చెప్తుంటే మమత శ్రద్ధగా విన్నారట. కాసేపు అయ్యాక మమత బెనర్జీ కార్యదర్శి వచ్చి పార్లమెంట్‌లో అవిశ్వాసం చర్చకు రాలేదని సభను రేపటి వాయిదా వేసుకొని వెళ్లిపోయారని చెప్పారట. దాంతో మమత ఎందుకలా అని ఆడిగారట. అన్నాడిఎంకే, టిఆర్ఎస్ పార్టీలు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశాయి. దాన్ని సాకుగా చూపించి సభ వాయిదా వేశారు అని చెప్పాడట. 
 
దాంతో మమతా సీరియస్‌గా తన స్టయిల్‌లో... ఏంటి కేసీఆర్ గారూ... ఇక్కడేమో బీజేపీపై పోరాటం చేద్దాం అంటారు సభలో వాళ్ళకు సహకరిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్. మీ ఎంపీలు మీ కంట్రోల్‌లో లేరా అని నిలదీయడంతో, దానికి కెసిఆర్ ఏదో సర్ది చెప్పబోతుంటే మీ దగ్గర ఇంకా చాలా విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. మీ కూతురు కవిత కేంద్ర మంత్రివర్గం లోకి తీసుకోమని బీజేపీలో మీ కులంకు సంబంధించిన ఒక గవర్నర్‌తో రాయబారం పంపించారనీ, దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది అని చెప్పారు. అంతే వెంటనే కవిత కలుగజేసుకుని అవన్నీ పుకార్లు మేడం అన్నారట. నేను జాతీయస్థాయి నాయకురాలినని, సాక్ష్యాలు లేకుండా ఏది మాట్లాడను.
 
నిజాయితీగా పోరాటం చేద్దాం అంటే రెడీ ఇలాంటివి నాకు నచ్చవు అన్నారట మమత. దీంతో కెసిఆర్ కలుగజేసుకుని మీ పాలన చాలా బాగుంది. మీ ఫైటింగ్ స్పిరిట్ అద్భుతమంటూ టాపిక్‌ను డైవర్ట్ చేసే పని చేశారట. దీంతో మమత కాస్త చల్లబడ్డాక ఆమె సన్నిహితులే మీడియాకు లీక్‌లు ఇచ్చారు. ఇక చేసేది లేక కెసిఆర్... మేడం, మనం ప్రెస్ మీట్‌కు వెళదాం అని చెప్పగా.. మీరెళ్ళి పెట్టండి అంటూ మమత అన్నారట. మీరు వస్తే బాగుంటుంది.. మేము ఒక్కరిమే పెట్టకూడదని రిక్వెస్ట్ చేశారట. దీంతో మమత సరేనంటూ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారట. హమ్మయ్య అంటూ కెసిఆర్ అండ్ టీం అక్కడి నుంచి వచ్చేసిన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద థర్డ్ ఫ్రంట్ కోసం పాకులాడుతున్న కెసిఆర్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలిందన్న ప్రచారం జరుగుతోంది.