శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 29 ఆగస్టు 2022 (15:42 IST)

త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు : ముఖేష్ అంబానీ

5gspectrum
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబై వేదికగా జరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 
 
వందకు వంద శాతం స్వదేశీయంగా తయారైన 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని, ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతంగా అందుకున్నట్టు చెప్పారు. జియో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభించేందుకు రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. 
 
ఇపుడు 5జీ ఫీల్డ్ కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. దేశీయంగా తామే తొలుత 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కూడా 5జీ సేవలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 
 
దీంతో పాటు విద్యా రంగంలో కూడా 5జీ సేవలన్ని అందిస్తామని తెలిపారు. గూగుల్‌తో కలిసి తయారు చేసిన జియో ఫోన్ నెక్స్ట్‌ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన విడుదల చేస్తామని ఆయన తెలిపారు.