శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (17:06 IST)

పవన్ కల్యాణ్ సార్.. అలాంటి వారిని పక్కనబెట్టుకోవద్దు... ఆర్జీవీ

pawan kalyan
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి బాహుబలి అని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆర్జీవీ ప్రకటించారు. 
 
మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కీలక సూచన చేశారు. "సార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒక నిజమైన అభిమానిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. దయచేసి మీ అంతరంగిక సన్నిహితులందరినీ తొలగించండి. కొందరు వ్యక్తులు.. మీ రాజకీయ జీవితాన్ని పాతిపెడతారు." అని సూచించారు.