సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (12:10 IST)

చరిత్రలో ఈ రోజు... టైటానిక్ నౌక ముక్కలైన రోజు.. గాంధీజీ చంపారన్ సత్యాగ్రహం..?

టైటానిక్ నౌక.. 1912లో సరిగ్గా ఇదే రోజున మునిగిపోయింది. నౌకలోని దాదాపు 1500 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మంచుకొండను ఢీకొట్టి రెండు ముక్కలైన ఈ నౌక బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. దీని కథను ఆధారంగా చేసుకుని 1997 లో టైటానిక్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఈ సినిమాలో ఆరోజో జరిగిన ఘటనలను కండ్లకు కట్టినట్లు చూపించారు.
 
టైటానిక్ 20 వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లండ్ ఓడల నిర్మాణ సంస్థ వైట్ స్టార్ లైన్ నిర్మించింది. దీని నిర్మాణం 1909 లో ప్రారంభమై.. 1912 లో పూర్తయింది. దీనికి 1912 ఏప్రిల్ 2 న సముద్ర పరీక్ష నిర్వహించారు. అనంతరం తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నౌక అనూహ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న పెద్ద మంచుకొండను గుర్తించలేక దానిని ఢీకొట్టింది. ఏప్రిల్ 14-15 రాత్రి సమయంలో ఈ ఓడ పూర్తిగా సముద్రంలోకి జారిపోయింది.
 
ప్రమాదం గురించి చాలా ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ఓడ కెప్టెన్ స్మిత్ మంచుకొండ హెచ్చరికలను పట్టించుకోలేదని, ఓడ వేగాన్ని తగ్గించలేదని చెప్తారు. ప్రమాదం తరువాత చాలా లైఫ్ బోట్లను సగం ఖాళీగా పంపించామని, మిగిలిన ప్రయాణికులను తీసుకెళ్లడానికి తిరిగి రాలేదని కూడా చెప్తారు. ఓడ 3 రోజులుగా మంటల్లో ఉన్నట్లు కూడా అంటుంటారు.
 
బీహార్‌లోని రైతులపై బ్రిటిష్ వారు చేస్తున్న దారుణాలకు నిరసనగా మహాత్మాగాంధీ 1917లో సరిగ్గా ఇదే రోజున బిహార్‌లోని చంపారన్ జిల్లాకు వచ్చి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. 
gandhi


బ్రిటిష్ వారు ఇక్కడి రైతులను ఇండిగో సాగు చేయమని బలవంతం చేయడంతో.. రైతులు తమ పొలాల్లో 20 భాగాలలో మూడో వంతు ఇండిగో సాగు చేయవలసి వచ్చింది. రైతులపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ సత్యాగ్రహాన్ని చేపడుతున్నట్లు పిలుపునిచ్చారు. అశాంతిని కలిగించాడనే ఆరోపణలతో గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.