సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 6 అక్టోబరు 2016 (12:47 IST)

నారా లోకేష్ అలిగాడా? అందుకే కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి రాలేదా?

విజ‌య‌వాడ ‌: కార్య‌క‌ర్త‌లు అంటే నా ఆరో ప్రాణం అంటూ, తెలుగుదేశం పార్టీకి ఊపిరిలూదుతున్న నారా లోకేష్... ఏకంగా త‌న తండ్రి సీఎం నారా చంద్ర‌బాబుపైనే అల‌క‌బూనారా? అందుకే ఇటీవ‌ల జ‌రిగిన తెలుగుదేశం శిక్ష‌ణ శిబిరానికి హాజ‌రుకాలేదా? ఆయ‌న‌కు మంత్రివ‌ర్గంలో స్థ

విజ‌య‌వాడ ‌: కార్య‌క‌ర్త‌లు అంటే నా ఆరో ప్రాణం అంటూ, తెలుగుదేశం పార్టీకి ఊపిరిలూదుతున్న నారా లోకేష్... ఏకంగా త‌న తండ్రి సీఎం నారా చంద్ర‌బాబుపైనే అల‌క‌బూనారా? అందుకే ఇటీవ‌ల జ‌రిగిన తెలుగుదేశం శిక్ష‌ణ శిబిరానికి హాజ‌రుకాలేదా? ఆయ‌న‌కు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌డంలో ఆల‌స్యం జ‌రిగేకొద్దీ... ఇలాంటి అనుమానాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 
 
ఏపీ తెలుగుదేశంలో ఇపుడు పెద్దఎత్తున చర్చ ఇదే జరుగుతోంది. చంద్రబాబు వైఖరిపై సొంతింట్లోనే తీవ్ర అసమ్మతి మొదలైందంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొడుకు లోకేష్‌కు పదోన్నతి కల్పించారు బాబు. అయితే, ఆయ‌న రాజ్యాంగేత‌ర శ‌క్తిగా ఎదుగుతున్నాడ‌ని బ‌య‌ట విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇవి పోవాలంటే, లోకేష్ బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి. దీనికోసం చంద్ర‌బాబు అన్ని ఏర్పాట్లు చేశారు. కేటీయార్‌కు అక్క‌డ కేసీయార్ ఐటి శాఖ ఇచ్చిన‌ట్లు, ఇక్క‌డ లోకేష్ బాబుకు ఐటీ శాఖ అప్ప‌గించాల‌ని ప్ర‌య‌త్నించారు. 
 
కానీ, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మోకాల‌డ్డారు. దీనితో త‌ను అనుకున్నట్టు ఇప్పటికీ ఏదో ఒక అధికారిక పదవి కట్టబెట్టలేదనే కోపం లోకేష్ బాబులో పెరిగిపోతోంది. తెలంగాణలో తన కౌంటర్ పార్ట్ కేటీయార్‌తో పోల్చుకునేకొద్దీ లోకేష్ కోపం రెట్టింపు అవుతోంది. చంద్రబాబు ఇటీవల పార్టీ నాయకుల ఎదుట మాట్లాడుతూ, ‘నాదేముంది? కొత్త ఇంటికి సంబంధించి అంతా లోకేష్ ఇష్టం, వాడేం చెబితే అదే’’ అని నిర్వేదంగా చెప్పార‌ట‌. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా రెండురోజులుగా నిర్వహించిన తెలుగుదేశం శిక్షణ శిబిరాల పరిసరాల్లోకి కూడా లోకేష్ రాలేదు… మొదటిరోజు పార్టీ నాయకులు ఏదో చెప్పారు గానీ రెండో రోజు కూడా రాకపోయేసరికి చివరకు కార్యకర్తల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.
 
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు, సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు కూడా వీటికి రాలేదంటే... ఇక అనుమానాలు జోరందుకున్నాయి. నిజానికి ఎంతోకాలంగా చంద్రబాబుపై సొంతింట్లో నుంచే విపరీతమైన ఒత్తిడి ఉంది. లోకేష్ బాబుకు ఏదో ఒక అధికార పదవి ఇవ్వాలనేది ఆ ప్రెజర్. ఓ దశలో ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిగా నియమించాలనుకున్నారు కానీ అదీ చేయలేదు… ఆరేడు నెలలుగా మంత్రివర్గంలోకి తీసుకుంటానూ అని చెబుతున్నాడు కానీ అదీ చేయడం లేదు… ఇంకోవైపు తను ఎప్పుడూ పోల్చుకునే కేటీయార్ అక్షరాలా కేసీయార్ రాజకీయ వారసుడు అనే పేరు తెచ్చేసుకున్నాడు… ఇది లోకేష్ బాబుకు మింగుడుపడటం లేదు…
 
లోకేష్ మాత్రమే కాదు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఈ విషయంలోనే చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది, బ్రాహ్మణి తండ్రి, హీరో బాలకృష్ణ కూడా చంద్రబాబుపై రుసరుసలాడుతున్నాడట. కనీసం ఓ మంత్రి పదవి కూడా దక్కకపోతే, ఇక లోకేష్ బాబుకు దక్కే ప్రాధాన్యమేంటి అనేది తన అసంతృప్తి… కనీసం దసరాకైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనీ, అందులో తనకు ఏదో ఓ మంచి పోర్ట్‌ఫోలియోతో స్థానం దక్కుతుందని అనుకున్నా సరే… ఇప్పుడప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చుననే సంకేతాల్ని చంద్రబాబు పంపిస్తున్నారు. ఇదీ లోకేష్ కోపానికి కారణం… నిజానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి, ఇప్పట్నుంచే జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించాలనీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిత్వం లోకేష్ బాబుకు అప్పగించాలనీ కూడా చంద్రబాబుపై ఒత్తిడి ఉందంటున్నారు. కానీ, సీనియ‌ర్ నాయ‌కులు ఇక్క‌డ దాన్ని ప‌డ‌నిస్తారా? అనేది అనుమానం.