శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (18:32 IST)

దీపావళి రోజున నువ్వులనూనెతో మర్దన చేసుకోవాల్సిందేనా?

నరకచతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. ఒంటినిండా శుభ్రంగా నూనెను పట్టించి, దానిని శెనగపిండితో రుద్దుకుని.. పావు గంట అలానే వుండి.. తలంటు స్నానం చేయాలి. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే శరీరభాగాలు మొద్దుబారిపోకుండా వుండేందుకు.. నూనెను పట్టించి.. అభ్యంగన స్నానం చేస్తారు. 
 
దీపావళి అభ్యంగనం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా దీపావళి రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెప్తున్నారు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శెనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. అందుకే దీపావళి రోజున నూనెతో శరీరానికి మర్దన చేసి అభ్యంగన స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే నరకచతుర్దశి నాటి నుంచే, ఇళ్లల్లో, ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.