గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2023 (21:34 IST)

ఫెస్టివ్ కలెక్షన్ 2023 కోసం సన్ సెట్ కలర్స్

image
అన్ని అంశాలలో మెరుపు, ప్రకాశంతో కూడిన వ్యక్తిగతీకరించిన ప్రత్యేక కలెక్షన్‌తో వేడుకల సీజన్‌కు సాదరంగా హెచ్&ఎం ఇండియా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. పార్టీకి సిద్ధంగా ఉన్న వస్త్రాలతో కూడిన ఈ కలెక్షన్ బలమైన భుజాలు, క్రాప్డ్ టాప్‌లు మరియు స్టేట్‌మెంట్ సూటింగ్, పార్టీ డ్రెస్‌లు మరియు మ్యాచింగ్ సెట్‌ల మధ్య వస్త్రాలలోని సూక్ష్మ వివరాలను ఈ డిజైన్‌లు ప్రదర్శిస్తాయి. రైన్‌స్టోన్‌లు, సీక్విన్స్, హై-షైన్ ఫ్యాబ్రిక్‌లు ప్రతి వస్త్రానికి అధునాతనతను మరియు చైతన్యాన్ని తీసుకువస్తాయి. అయితే హాట్ పింక్, నారింజ, ఎరుపు, ఇసుక, బంగారం, నలుపు రంగులతో కూడిన కలర్ పాలెట్ వేడుకల ధోరణికి మరింత ఆనందం జోడిస్తుంది.

పండుగ కలెక్షన్ కోసం, సీజన్ యొక్క అందం- ఉల్లాసాన్ని వెల్లడిస్తూ ఒక ప్రత్యేక కలెక్షన్‌ను రూపొందించాలని హెచ్ఎం కోరుకుంది. వెయిస్ట్ లైన్  వెంబడి, షోల్డర్ లైన్స్ మరియు శరీరం అంతటా డ్రేప్ చేయడం స్త్రీ రూపానికి ప్రాధాన్యతనిస్తుంది, అయితే పొడవాటి ప్యాంటు- స్కర్టులు ఆకట్టుకునే క్రాప్డ్ టాప్‌లతో మరింత ఆకర్షణ జోడిస్తుంది. టోనల్ లుక్స్ చాలా ముఖ్యమైనవి, కానీ విభిన్నమైన ఫ్యాబ్రిక్‌లు మరియు అలంకారాలు దానిని సరదాగా మరియు ఆధునికంగా మారుస్తాయి.

“ఈ ఫెస్టివ్ కలెక్షన్ సంవత్సరంలో చాలా ప్రత్యేకమైన సమయంలో వస్తుంది మరియు మేము ఈ కలెక్షన్‌ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాము. మేము కాంతి యొక్క ప్రాముఖ్యత - కొవ్వొత్తులు, లాంతర్లు మరియు బాణసంచాతో నిజంగా ప్రేరణ పొందాము. దానిని స్పష్టమైన సూర్యాస్తమయ రంగుల( సన్ సెట్ కలర్) పాలెట్‌గా మార్చాము, దానితో పాటుగా సీక్విన్స్, రైన్‌స్టోన్‌లు మరియు శాటిన్‌లను కూడా తీసుకువచ్చాము. ఈ కలెక్షన్ మెరుపు మరియు ప్రకాశంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరినీ తమ పార్టీ లుక్‌లో చూడటానికి మేము వేచి ఉండలేము!" అని హెచ్&ఎం లో కాన్సెప్ట్ డిజైనర్ ఎలియానా మస్గలోస్ చెప్పారు.