శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (16:15 IST)

టీమ్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కామెంటేటర్

క్రికెట్ అంటే ఎంత పిచ్చో... చాలా మందికి ఫుట్‌బాల్ అన్నాకూడా అంతేప్రాణం. తమ దేశ జట్టు ఓడిపోతే ప్రాణాలు విడిచే ఫుట్‌బాల్ అభిమానులు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన ఓ అభ

క్రికెట్ అంటే ఎంత పిచ్చో... చాలా మందికి ఫుట్‌బాల్ అన్నాకూడా అంతేప్రాణం. తమ దేశ జట్టు ఓడిపోతే ప్రాణాలు విడిచే ఫుట్‌బాల్ అభిమానులు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఈసారి ఏకంగా ఓ కామెంటేటర్ తమ టీమ్ ఓటమిని తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యాడు. ఆ క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు.
 
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ గ్రూప్ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోయింది. అప్పటివరకు మ్యాచ్ చూస్తుండిన అబ్దుల్ రహీమ్ మొహమ్మద్ గుండెపోటుతో చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో చివరి క్షణాల్లో సౌదీ గోల్ చేసి 2-1తో విజయం సాధించింది. దీన్ని జీర్ణించుకోలేని రహీమ్ అక్కడ కుప్పకూలి చనిపోయాడు. 
 
మ్యాచ్ తర్వాత అబ్దుల్ నైల్ స్పోర్ట్స్ చానెల్‌కు విశ్లేషణ అందించాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న సమమంలోనే చాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతన్ని బతికించడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని డాక్టర్లు తేల్చారు.