శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (16:15 IST)

ఫిఫా ప్రపంచకప్‌- బోణీ కొట్టిన క్రొయేషియా

ఫిఫా ప్రపంచకప్‌లో క్రొయేషియా తన ఖాతాలో గెలుపును నమోదు చేసుకుంది. గ్రూపు-డిలో నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0తేడాతో క్రొయేషియా గెలుపును నమోదు చేసుకుంది. ప్రతిభావంతులతో కూడిన క్రొయేషియా జట్టు ఆద్యంతం మె

ఫిఫా ప్రపంచకప్‌లో క్రొయేషియా తన ఖాతాలో గెలుపును నమోదు చేసుకుంది. గ్రూపు-డిలో నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0తేడాతో క్రొయేషియా గెలుపును నమోదు చేసుకుంది. ప్రతిభావంతులతో కూడిన క్రొయేషియా జట్టు ఆద్యంతం మెరుగ్గా రాణించింది. 
 
జట్టు క్రీడాకారులు ఆద్యంతం దూకుడు కనబరిచారు. మ్యాచ్ ప్రథమార్థంలో 32వ నిమిషంలో నైజీరియా ఆటగాడు ఎట్బో ఓన్ గోల్ చేశాడు. తద్వారా 1-0తో క్రొయేషియా ఆధిక్యం సాధించింది. అప్పటి నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 
 
ఇక ద్వితీయార్థంలో బంతిని నియంత్రణలోకి తెచ్చుకున్న నైజీరియా చాలా సార్లు ఎటాక్‌కు దిగింది. కానీ గోల్‌ చేసే అవకాశం దక్కలేదు. అలాంటి సమయంలో ఆటకు 71నిమిషయంలో క్రొయేషియాకు పెనాల్టీ అవకాశం లభించడంతో మిఢ్‌ఫీల్డర్‌ లుకా మోర్డిచ్‌ దానిని గోల్‌గా మలిచి మ్యాచ్‌ ఆధిక్యాన్ని 2-0కి చేర్చాడు. దీంతో క్రొయేషియా గెలుపును సాధించింది.