శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (10:41 IST)

ఫిఫా ప్రపంచ కప్- ఫేవరేట్‌గా బెల్జియం.. నిలకడగా ఆడితే టైటిల్ ఖాయమా?

ఫిఫా ప్రపంచ కప్ పోటీలకు సర్వం సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో ఈ పోటీలు ప్రారంభం కానున్న వేళ.. బెల్జియం టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. వరుసగా మూడో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన బెల్జియం అత్యంత పటిష్టంగా వుం

ఫిఫా ప్రపంచ కప్ పోటీలకు సర్వం సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో ఈ పోటీలు ప్రారంభం కానున్న వేళ.. బెల్జియం టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. వరుసగా మూడో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన బెల్జియం అత్యంత పటిష్టంగా వుంది. టైటిల్‌ ఫేవరెట్లలో బెల్జియం ఒకటని క్రీడా పండితులు అంటున్నారు.


అలాగే ఈ టోర్నీలో ప్రధాన పోటీదారులైన జర్మనీ, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ల సరసన బెల్జియం నిలుస్తుందని వారు చెప్తున్నారు.  ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌ల్లో ఆ జట్టు జోరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 
 
క్వాలిఫయర్స్‌లో అజేయంగా నిలిచిన రెడ్‌ డెవిల్స్‌ మొత్తం 43 గోల్స్‌ కొట్టింది. అత్యధిక గోల్స్‌ చేసిన జట్టుగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీతో సమానంగా నిలిచింది. ఐతే కప్పుపై కన్నేసిన బెల్జియంకు నిలకడలేమే ప్రధాన సమస్యగా మారింది.

ఒక్క టోర్నీలో బెల్జియం గెలిస్తే.. మరో టోర్నీకి వచ్చేసరికి తడబడుతోంది. గత ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఓడి క్వార్టర్స్‌లో నిష్క్రమించిన ఈ జట్టు సత్తా చూపితే గెలిచే ఆస్కారం వుందని క్రీడా పండితులు సూచిస్తున్నారు.