ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (11:02 IST)

ఫిఫా వరల్డ్ కప్ 2018 : ప్రీ క్వార్టర్స్‌కు చేరిక చేరిన ఫ్రాన్స్

ఫిఫా వరల్డ్ కప్ 2018 మెగా ఈవెంట్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టు ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పెరూపై ఆ జట్టు విజయం సాధించింది. ఫలితంగా ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా, 36 ఏ

ఫిఫా వరల్డ్ కప్ 2018 మెగా ఈవెంట్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టు ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పెరూపై ఆ జట్టు విజయం సాధించింది. ఫలితంగా ఫ్రాన్స్ ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా, 36 ఏళ్ల అనంతరం వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన పెరూ.. రెండు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
గురువారం పెరూతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఫ్రాన్స్‌ గెలిచింది. దీంతో రెండు పరాజయాలతో ప్రపంచ 11వ ర్యాంకర్‌ పెరూ ప్రస్థానం ముగిసింది. తమ చివరి ఏడు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఈ జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గలేదు. అయితే ఈ మ్యాచ్‌లో 54 శాతం బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నా పెరూకు అదృష్టం కలిసిరాలేదు. ద్వితీయార్ధంలో ఎదురుదాడికి దిగి పలు అవకాశాలను సృష్టించుకున్నా త్రుటిలో మిస్‌ అయ్యాయి.
 
నిజానికి ప్రథమార్ధం ఆరంభంలో ఏడో ర్యాంకర్‌ ఫ్రాన్స్‌పై పెరూ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి 10 నిమిషాల్లో ఈ జట్టు పూర్తి పట్టు సాధించి బంతిని ఎక్కువగా తమ నియంత్రణలోనే ఉంచుకుంది. ఆ తర్వాత పట్టుకోల్పోవడంతో పెరూ జట్టు ఓటమి చవిచూడక తప్పలేదు.