సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (12:13 IST)

మితిమీరిన ఆటగాళ్ల సంబరం.. మీడియా మీట్‌లో ముందు బాటిళ్ళతో...

సాకర్ ప్రపంచ కప్ విజేతగా అవతరించిన ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబరాలు మితిమీరిపోయాయి. అంతర్జాతీయ మీడియా సమావేశం జరుగుతుందన్న కనీస విషయాన్ని కూడా వారు మరిచిపోయి.. ఏకంగా మీడియా సమావేశ హాలులోకి మందుబాటిళ్ళతో ప్రవే

సాకర్ ప్రపంచ కప్ విజేతగా అవతరించిన ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబరాలు మితిమీరిపోయాయి. అంతర్జాతీయ మీడియా సమావేశం జరుగుతుందన్న కనీస విషయాన్ని కూడా వారు మరిచిపోయి.. ఏకంగా మీడియా సమావేశ హాలులోకి మందుబాటిళ్ళతో ప్రవేశించి నానా హంగామా చేశారు. అంతేనా... మీడియా ముందు మందేసి చిందేశారు.
 
ఫ్రాన్స్ జట్టు కోచ్ డిడియర్ డెషాంప్స్ ప్రసంగించేందుకు సిద్ధం కాగా, ఆటగాళ్లు ఒకరిపై ఒకరు షాంపైన్ చల్లుకుంటూ సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టేబుళ్లు ఎక్కి గంతులేశారు. చొక్కాలు విప్పేసి చిందులేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. 
 
కాగా, 1998లో ప్రస్తుత కోచ్ డెషాంప్స్ కెప్టెన్‌గా కప్పు గెలిచిన ఫ్రాన్స్, ఇప్పుడు రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా ఒక దేశపు ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా, ఆపై అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరించి కప్‌ను అందుకున్న మూడో వ్యక్తి డెషాంప్స్. ఆటగాళ్ల చిందుల వీడియోను ఓసారి తిలకించండి.