సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. స్వాతంత్ర్య దినోత్సవం
  3. స్వాతంత్ర్య సమరయోధులు
Written By ivr
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (22:53 IST)

తెల్లదొరలకు సింహ స్వప్నం... సుభాష్ చంద్రబోస్...

ఫిబ్రవరి 4, 1944వ సంవత్సరం ఆంగ్లేయుల ఏకాధిపత్య పిడికిలి నుంచి భారత్‌ను రక్షించేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బయలుదేరిన రోజు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనికరీతిన పోరాడి స్

ఫిబ్రవరి 4, 1944వ సంవత్సరం ఆంగ్లేయుల ఏకాధిపత్య పిడికిలి నుంచి భారత్‌ను రక్షించేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బయలుదేరిన రోజు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనికరీతిన పోరాడి స్వతంత్ర్యం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాంతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
 
స్వాంతంత్ర్య కోసం చేసిన పోరాట చివరిఘట్టంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయంతో అన్యదేశ మట్టిలో కాలూని భారత్ స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది. 
 
అహింస, సాత్త్వికమైన మార్గంలో మాత్రమే స్వాతంత్ర్యం లభించదని ఆయుధాలను చేతపట్టే స్వాతంత్ర్యాన్ని సాధించగలమనే నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లేవనెత్తారు. భారత్‌ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాడటం తెలుసని ప్రపంచానికి ఎత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది. 
 
అహింసా మార్గంలో మాత్రమే కాకుండా వీర మార్గంలో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నేతాజీ తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరారు. బ్రిటిష్ ఏకాధిపత్యాన్ని అహింసా మార్గంలో అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండేళ్లు ఎంపికయ్యారు. 
 
అయితే అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941వ సంవత్సరం హౌస్ అరెస్ట్‌లో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. ఆప్ఘనిస్థాన్, రష్యా, మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు. రెండో ప్రపంచయుద్ధం సమయాన్ని సద్వినియోగం చేసుకుని జర్మన్- ఇటలీల సహాయంతో హిట్లర్‌తో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి.
 
ఆయుధ యుద్ధాన్ని ప్రారంభించదలచిన బోస్ 1943వ సంవత్సరం జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాల్లోని భారత జాతీయ సైనికదళానికి జీవం పోశారు. 1944వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ బర్మా రాజధాని రాంకూన్‌ నుంచి ‌భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత రెండేళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్- కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల ధాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది.
 
ఈ సైన్యం ఇమ్మాల్ నగరానికి చేరుకుని ఇమ్మాల్ సైనిక స్థావరాన్ని ముట్టడించింది. ఈ పోరులో ఇరువర్గాలకు మధ్య తీవ్రపోరు జరిగింది. జూన్ 27వ తేదీ ఇమ్మాల్ ముట్టడిని విరమించిన జాతీయ సైన్యం భారత జాతీయ సైన్యంతో బరిలోకి దిగి పరాజయాన్ని చవిచూసింది. 
 
బ్రిటిష్ సైనిక దళాల చేతుల్లో కాకుండా భారీ వర్షాలతో కూడిన వరదల వల్లనే పరాజయం పాలైందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. ఇమ్మాల్‌పై దాడులు తప్పవని నేతాజీ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన విఫలమైంది. సింగపూర్, రంగూన్ సైనిక దళాలకు బ్రిటిష్ దళాలు దగ్గరయ్యాయి. 
 
1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని తమ సైనిక దళాలకు రేడియో ద్వారా తెలియజేస్తూ నేతాజీ మాట్లాడిన అంశాలివే...
 
ఈ తాత్కాలిక ఓటమితో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మనోధైర్యంతో ముందుకు నడవండి. భారతదేశాన్ని బానిసత్వం, ఏకాధిపత్యంనుంచి త్వరలో విడుదల పొందుతుందని నేతాజీ ప్రసంగాన్ని ముగించారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత నేతాజీకి దేశాభిమానాన్ని అలవరిచిన శ్రీ అరవిందర్ పుట్టినరోజైన ఆగస్టు 15వ తేదీన భారత్‌కు స్వతంత్ర్యం లభించింది. 
 
1879వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఒరిస్సా, ఖాట్గాలో నేతాజీ జన్మించారు. తండ్రి జానకీ నాథ్. తల్లి ప్రభావతీ బోస్, చిన్న నాటి నుంచే విద్యారంగంలో రాణించిన నేతాజీ శ్రీ రామకష్ణ, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. సన్యాసం తీసుకోడానికి తీర్మానించారు.
"మానవసేవే మాధవసేవ" అనే నినాదంతో పాటు రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. శ్రీ ఆర్యా పత్రికలో సంపాదకుడిగా రాసే వ్యాసాలు స్వాతంత్రసమరంలో పాల్గొనే వీరులకు ఉత్సాహాన్ని ఏర్పరచాయి. 
 
1919వ సంవత్సరం తత్త్వ పాఠ్యాంశంలో నేతాజీ డిగ్రీని సంపాదించారు. తర్వాత ఇంగ్లండ్‌కు బయలుదేరిన సమయంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో జలియన్ వాలా బాగ్ సంఘటన చోటుచేసుకుంది. 1921వ సంవత్సరం ఐసీఎల్‌ను ముగించిన బోస్ ఐసీఎల్ అధికారిగా బాధ్యతలు వహించక స్వాతంత్రసమరంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
వెల్స్ క్యూన్ భారత్ రాకకు వ్యతిరేకంగా చిత్తరంజన్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. అనంతరం 20 సంవత్సరాల్లో 11 సార్లు బ్రిటిష్ ప్రభుత్వంచే అరెస్టయ్యారు. 1928వ సంవత్సరం డిసెంబర్ నెలలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పూర్తి స్వాతంత్ర్యం లభించేంతవరకు ఒప్పుకునేది లేదని తీర్మానించింది. 
 
అయితే గాంధీజీ అహింసా వాదంతో ఈ తీర్మానం సద్దుమణిగిందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. 1929వ సంవత్సరంలో లాహూర్‌లో జరిగిన బహిరంగ సభ నేతాజీని కాంగ్రెస్ కార్మికసంఘ అధ్యక్షుడిగా నియమించింది. 1938వ సంవత్సరంలో బోస్ 41 ఏట అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 
 
1939వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్దతు ఎన్నికల బరిలోకి దిగిన పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. 1945 ఆగస్టు 22వ తేదీ నేతాజీ పయనించిన యుద్ధవిమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్ రేడియో ప్రకటించింది. ఈ ప్రకటనను ఇంతవరకు ఎవరూ నమ్మడం లేదు. స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రతిక్షణమూ పాటుపడిన నేతాజీ మరణవిషయం నేటికీ అనుమానాస్పందంగానే ఉంది.