సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. స్వాతంత్ర్య దినోత్సవం
  3. స్వాతంత్ర్య సమరయోధులు
Written By ivr
Last Modified: గురువారం, 9 ఆగస్టు 2018 (23:00 IST)

జాతిపిత గాంధీజీకి సత్యం, అహింసలే దేవతలు

భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా ఆగస్టు 15 జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బ్రిటిష్ బానిసత్వం నుంచి విడుదలైన రోజు అది. ఆ రోజుకు గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించారు.

బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యం, అహింసలను దేవతలుగా కొలిచారు. 
 
ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.
 
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు.