1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (16:08 IST)

మునగాకు రసాన్ని ప్రతినిత్యం సేవిస్తే..?

పచ్చని ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఆకుకూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో మునగాకుదే అగ్రస్థానం. మునగలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మునగాకును ఉడికించి ఆ నీటిని సేవించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉంటుంది. కంటి వ్యాధులను సైతం ఈ జ్యూస్ నయం చేస్తుంది. మునగాకు వాతము, కఫమును హరిస్తాయి. దృష్టి మాంద్యమును, రేచీకటిని పోగొడతాయి.
 
ములగ ఆకులలో అమినో ఆమ్లములు పుష్కలంగా ఉంటాయి. అందువలన మాంసకృత్తుల లోపము వలన వచ్చు రోగములను నిరోధించుకోవచ్చు. గర్భిణులకు పాలిచ్చే తల్లులకు ములగ ఆకు రసం ఎంతో మేలు చేస్తుంది. దోసకాయరసంతో కొంచెం ములగ ఆకు రసాన్ని కలిపి ప్రతినిత్యం సేవిస్తే గుండె, కాలేయం, మూత్రపిండాల అపసవ్యత వలన శరీరానికి నీరు పట్టకుండా నిరోధిస్తుంది. 
 
ములగ ఆకు కీళ్ల అరుగుదల, కాలేయం పెద్దవి కావటం, తదితర వ్యాధులను దూరం చేస్తుంది. ములగపూల రసం స్త్రీలో వద్ధాప్య ఛాయలను పోగొడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.