శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 30 జులై 2024 (22:23 IST)

తులసి విత్తనాలు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

tulasi
తుల‌సి ఆకులు, తుల‌సి విత్త‌నాలు. వీటిలో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. రోజు తుల‌సి విత్త‌నాల‌ను తింటే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. తుల‌సి విత్త‌నాల‌ను రోజూ తినడం వలన ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకుందాము.
 
తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. 
రోజూ తులసి విత్తనాలను తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. 
తుల‌సి విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.
తుల‌సి విత్త‌నాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా చూస్తాయి.
తుల‌సి విత్త‌నాల‌ను తినడం వలన గుండెజబ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.
చర్మంపై వచ్చే ముడతలు తగ్గేందుకు తులసి విత్తనాలను తింటే ఫలితం కనిపిస్తుంది. 
తులసిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. దాంతో వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.