1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 జులై 2024 (19:44 IST)

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి. ఇది వికారం, వాంతులు లేదా కాంతి, ధ్వనికి సున్నితత్వం వంటి వాటివల్ల సంభవించవచ్చు. చాలా మందిలో, తలపై ఒక వైపు మాత్రమే నొప్పి అనుభూతి చెందుతుంది. ఈ మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి పెరటి వైద్యం చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడానికి ద్రాక్ష రసం లేదా కొబ్బరి నీరు త్రాగాలి.
నిమ్మరసంలో అల్లం మిక్స్ చేసి తాగినా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 
దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదిటిపై అరగంట పాటు రాసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ఫలితం వుంటుంది.
ఈ సమస్య వున్నవారు బలమైన కాంతికి తగలకుండా చూసుకోవాలి.
మైగ్రేన్ వచ్చినప్పుడు మాడు పైన మసాజ్ చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
పాలలో బెల్లం కలిపి త్రాగినా ఫలితం వుంటుంది.
రెగ్యులర్ యోగా చేసినా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవాలి.