బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By ivr
Last Modified: సోమవారం, 26 జూన్ 2017 (16:18 IST)

మొబైల్‌ ఫోనుతో 'టెక్ నెక్' సమస్య ... ఇవి కూడా వచ్చేస్తాయ్...

ఏ వస్తువునైనా... ఆఖరికి శరీరాన్నయినా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరి వాడితే తేడా చేస్తుంది. సెల్ ఫోను కూడా అంతే. సెల్ ఫోనులో గంటల తరబడి మాట్లాడేవారికి మొటిమలు, అలెర్జీలు, చర్మంపై ముడతలు, నల్లమచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం వుందన

ఏ వస్తువునైనా... ఆఖరికి శరీరాన్నయినా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరి వాడితే తేడా చేస్తుంది. సెల్ ఫోను కూడా అంతే. సెల్ ఫోనులో గంటల తరబడి మాట్లాడేవారికి మొటిమలు, అలెర్జీలు, చర్మంపై ముడతలు, నల్లమచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం వుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 
 
* గంటల తరబడి మొబైల్ ఫోన్‌ను చూస్తుండటం వల్ల గడ్డం కింద, మెడ కింద ముడతలు ఏర్పడుతాయి. వీటిని టెక్ నెక్ అంటారు.
 
* చంపలపై దద్దుర్లు, ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా వుంది. ఎందుకంటే చాలా స్మార్ట్ ఫోన్ల కేసింగ్స్ పైన నికెల్, క్రోమియంలు వుంటాయి. వీటివల్ల ముఖం మీద వున్న చర్మంపై అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే అవకాశం వుంది. అందుకే మొబైల్ పైన ప్లాస్టిక్ కేసును వాడితే చర్మానికి మంచిది. 
 
* మొబైల్ ఫోనుపైన సూక్ష్మక్రిములు పేరుకుని వుంటాయి. ఫలితంగా చర్మంపై మొటిమలు వస్తాయి. ముఖానికి దగ్గరగా పెట్టుని ఫోనులో మాట్లాడటం వల్ల ముఖానికి వున్న చమట, మేకప్ తదితరాలు ఫోనుకు అంటుకుంటాయి. కొందరికి సెల్ ఫోనను వాష్ రూముకు తీసుకెళ్లే అలవాటు వుంటుంది. అక్కడే తిష్ట వేసి వున్న సూక్ష్మక్రిములు ఫోనుపైకి చేరి రోగాన్ని కలిగిస్తాయి. కనుక ఇలాంటి సమస్యల లేకుండా వుండాలంటే మొబైల్ ఫోనును తరచూ శుభ్రం చేస్తుండాలి. 40 శాతం ఆల్కహాల్ వున్న క్లీన్సర్లతో వీటిని తుడవాలి. ఇయర్ ఫోన్స్ వాడితే చాలావరకు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
 
* ఫోను వేడి కారణంగా ముఖంపై నల్లని మచ్చలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి వీలైనంత తక్కువగా ఫోనులో మాట్లాడితే మేలు.