ముల్లంగిని గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే..? అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే?
ముల్లంగిని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. మూత్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు. మూత్ర పిండాల్లో ఇనెఫెక్షన్ ఉంటే దూరం చేస్తుంది. వ్యర్థాలుంటే మూత్రం ద్వారా వెలివేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇదెంతో ఉపయోగ
ముల్లంగిని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. మూత్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు. మూత్ర పిండాల్లో ఇనెఫెక్షన్ ఉంటే దూరం చేస్తుంది. వ్యర్థాలుంటే మూత్రం ద్వారా వెలివేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో పీచు అధికం. క్యాలరీలు తక్కువ. అదీకాక తక్కువ మొత్తంలో తీసుకున్నా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. చర్మం మీద మురికిని తొలగించుకోవాలంటే... ముల్లంగిని గుజ్జులా చేసి పూతలా వేసుకుంటే ఫలితం ఉంటుంది.
ముల్లంగి జీవప్రకియల రేటు వృద్ధి చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం అధికం. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ దుంపలో అధికం. ఇవి శరీరంలో క్యాన్సర్లకు కారణమయ్యే కారకాలతో పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ముల్లంగిని వారానికి రెండుసార్లు తీసుకుటే.. అల్సర్‌ను దూరం చేసుకోవచ్చు. శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా ఉంటుంది. ముల్లంగిలోని విటమిన్ బి, జింక్, ఫాస్పరస్ చర్మాన్ని నిర్జీవంగా మారకుండా కాపాడతాయి. డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.