Daily Horoscope
✕

జలుబు, దగ్గుకు దివ్యౌషధం.. తమలపాకు కషాయం..

Written By సెల్వి
Updated: సోమవారం, 10 ఆగస్టు 2020 (15:29 IST)
తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు వెంటనే అరికడుతుంది. తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది. తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది. 
 
జలుబు, దగ్గుతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే రెండు కప్పుల నీళ్ళు వేడిచేసి అందులో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఒక కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, నయమౌతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
తమలపాకులో పలు పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్‌, ఇనుము, క్యాల్షియం, విటమిన్‌ సి, విటమిన్‌ బి, జింక్‌లు సమృద్ధిగా ఉన్నాయి. కొద్ది మోతాదులో ప్రొటీన్‌ కూడా ఉంది. భోజనం తరువాత తమలపాకులు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. 
 
మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఐరన్‌, క్యాల్షియం ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది. వక్క, పొగాకు లేకుండా ఆరోగ్యకరమైన పాన్‌ను తయారుచేసుకుంటే, తినడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

జైలు నుంచి విడుదలైన కాక్రోచ్ పార్టీ నేతలు - ఆ వెంటనే పోలీస్ నోటీసులు

ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఇలాంటిదేనేమో? భార్య ఎముకలు విరిగేటట్లు కౌగలించుకున్న భర్త, వీడియో

రూ. 20 వాటర్ బాటిల్ కోసం విజయవాడ పటమటలో వ్యక్తి హత్య

ఏపీ నకిలీ వాట్సాప్ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. పవన్ ఆదేశాలు

ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుుగుపెట్టిన సోనియా గాంధీ... తొలి పోస్ట్ ఇదే... (Video)

అన్నీ చూడండి

సోషల్ మీడియాతో తంటాలు పడుతున్న హీరోయిన్లు.. అయినా చుక్కలు చూపిస్తున్నారు..

పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్ ప్రకటన

విజయదశమి సందర్భంగా GEN Z GIRLS’ టైటిల్ అనౌన్స్మెంట్

అల్లు అర్జున్ గురించి కాఫీ విత్ కరణ లో విషయాలు పంచుకున్న రష్మిక మందన్న

కిల్లర్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది - డైరెక్టర్ హరీశ్ శంకర్

తర్వాతి కథనం
Show comments