Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం ఇలా వుంటే.. ఆరోగ్యం భేష్..

Written By సెల్వి
Updated: ఆదివారం, 8 మార్చి 2020 (15:04 IST)
ఉదయం పూట అల్పాహారం మహారాజులా చేయాలంటారు పెద్దలు. అప్పుడే ఒబిసిటీ ఇబ్బంది వుండదు. ఉదయం పూట కడుపు నిండా తినడం ద్వారా మధ్యాహ్నం పూట మితంగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇక రాత్రి పూట అంతగా ఆకలి వేయదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇంకా అల్పాహారంలో ఇవన్నీ వుంటే ఆరోగ్యంగా వుండగలుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
అవేంటో చూద్దాం.. ఉదయాన్నే టిఫిన్‌లో భాగంగా రాగి జావ తీసుకోవడం ఉత్తమం. ఓట్స్ ఉప్మా, లేదా పాలల్లో ఓట్స్ వేసుకుని తీసుకోవచ్చు. లేదా పాలతో కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అల్పాహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తప్పని సరిగా ఉండేలా చూసుకోండి. కోడిగుడ్డు అది కూడా ఉడికించిన కోడి గుడ్డు రోజుకు ఒకటి అల్పాహారంలో తీసుకోవాలి.
 
సోయాపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మనం తీసుకునే పాల స్థానంలో వారంలో రెండు మూడు రోజులైనా సోయా పాలు తీసుకోవాలి. వారంలో ఒక రోజయినా పూరీని అల్పాహారంగా తీసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పూరీలు, వెజిటబుల్ కర్రీ మంచి ఆహారం. ఉదయం పుల్కాలు తినే వారు అందులోకి తాజా కూరగాయలతో పాటు చిరుధాన్యాలతో ఒక కూర చేసుకుంటే శరీరానికి తగిన శక్తి వస్తుందని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

అన్నీ చూడండి

ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం: నారా లోకేష్

ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?

Pawan Kalyan: గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు

తమిళనాట 100 రోజుల పాలన.. తెలుగు వార్తాపత్రికల్లో ప్రకటనలు.. ఎందుకని?

కేటీఆర్, హరీష్ రావు ప్రైవేట్ ఆసుపత్రులకు రక్తాన్ని విక్రయించారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

Fauji fight : ఓల్డ్ సిటీలో ఫౌజీ పోరాటం, ప్రభాస్ పుట్టినరోజున సరికొత్త అప్ డేట్

అనసూయ భరద్వాజ్ ఊహించని షాక్.. బీజేపీ నేతల ఫిర్యాదు

Allu Arjun: అరుదైన మైలురాయిని చేరుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

ఏడు రాష్ట్రాల్లో హెచ్ పీవీ అవేర్ నెస్ కు సపోర్ట్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్

తగ్గేదేలే హీరోయిన్ అనన్య.. అనారోగ్య సమస్యలు.. నిద్రలోనే కన్నుమూసింది..

తర్వాతి కథనం
Show comments