శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (13:54 IST)

సూర్యుడితో స్నేహం చేస్తే.. ఆరోగ్యానికి మంచిది..

సూర్యుడితో స్నేహం చేస్తే.. ఆరోగ్యానికి మంచిది.. అంటున్నారు నిపుణులు. ఆధ్యాత్మికపరంగానూ, ఆరోగ్యపరంగా మేలు చేకూరాలంటే.. రోజూ సూర్యనమస్కారం చేయాలని అంటున్నారు. భూమికి సూర్యుడే ప్రాణ ప్రదాత. ప్రకృతితో పాటు సమస్త జీవరాశులకూ శక్తినిచ్చేది సూర్యుడే. అందుకే సూర్యుడ్ని అన్వయించుకుని, అంతర్గతం చేసుకుని.. మీ వ్యవస్థలో మార్పు కోసం సూర్య నమస్కారం తీసుకోవాలి.  
 
ఋతుక్రమానికి పట్టే 28 రోజుల సమయానికీ, 12 సంవత్సరాలు పట్టే సూర్యుని పునరావృత చక్రానికీ మధ్య మరిన్ని పునరావృత చక్రాలు ఉన్నాయి. పునరావృతమంటేనే మళ్లీ మళ్లీ వచ్చేవి. సూర్యనమస్కారం శరీరాన్ని ఉన్నతస్థితికి చేరుస్తుంది. సౌరవ్యవస్థకు, మనుషులకు ఈ చక్రీయస్వభావం నిలకడను అందిస్తుంది. మనుషులు చేరుకోవాల్సిన పరిణతికి చేరుకోగానే సహజంగానే వారు స్థిరత్వాన్ని కాకుండా ముక్తిని కోరుకుంటారు.
 
మీరు చాలా ఎక్కువ నిర్భందనాలు కలిగిన వారైతే, మీ పరిస్థితులు, అనుభవాలు, ఆలోచనలు, భావోద్వేగాలు ఎక్కువ వలయాలుంటాయు. ఆరు నెలలు, పద్దెనిమిది నెలలు, మూడేళ్లు, ఆరేళ్లకో ఇలా అవి మీ వైపు వస్తుంటాయి. అవి పన్నెండేళ్లకు ఒకసారి వస్తే మీ వ్యవస్థ మంచి గ్రహణస్థితిలో, సమతుల్యంతో ఉన్నట్లు అర్థం. ఇలా జరగటానికి సూర్య నమస్కారాలు ఎంతో తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.