శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (13:13 IST)

సోయా ఉత్పత్తుల్ని వాడుతున్నారా?

Soya
సోయా ఉత్పత్తుల్ని వాడుతున్నారా? లేదంటే తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోయా ఉత్పత్తుల్ని వాడటం వల్ల బీపీ, హృద్రోగ వ్యాధులు తగ్గుతాయి. సోయా ఉత్పత్తులు శరీరంలో కోలన్ క్యాన్సర్ లేదా పెద్దపేగు క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది. అంతేకాకుండా, సోయా ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థ, అన్న వాహికను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
ఎముకల బలాన్ని పెంచుకోటానికి, విటమిన్ డి, క్యాల్షియం అధికంగా వున్న సోయా ఉత్పత్తులను వాడటం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుంది. సోయా ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్న సోయా ఆహారాలను తీసుకోవటం వలన, శరీర రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గుతాయి.
 
మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీర కణాలు ఇన్సులిన్‌ను గుర్తుపట్టేలా చేసి, ఈ హార్మోన్ వలన కణాలలో గ్లూకోస్ గ్రహించాటాన్ని అధికం చేస్తాయి. ఫెర్టిలిటి సమస్యను సోయా నివారిస్తుంది. సోయా ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.