పిక్కల్ని తగ్గించుకోవాలంటే.. సైక్లింగ్ చేయండి.. 2 కప్పుల గ్రీన్ టీ తాగండి
మహిళలూ కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటే తొడలు, పిక్కలు, పొట్ట పెరిగిపోతాయి. ఈ ప్రాంతాల్లో కొవ్వ
మహిళలూ కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటే తొడలు, పిక్కలు, పొట్ట పెరిగిపోతాయి. ఈ ప్రాంతాల్లో కొవ్వు చేరడం ద్వారా మధుమేహం, గుండె జబ్బులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో 87 శాతం మంది మహిళలు అధిక బరువుతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే పిక్కలతో పాటు తొడలు, పొట్టను బాగా తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చునని వారు సూచిస్తున్నారు.
ఇందుకు ఏం చేయాలంటే..
రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. గ్రీన్ టీ తాగాలి. రోజూ రెండు కప్పుల గ్రీన్‌టీ తాగడం ద్వారా తప్పకుండా పిక్కల బరువు తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు రోలింగ్ వ్యాయామాలు చేయాలి. పిరుదుల మీద భారంవేస్తూ అటూ, ఇటూ కదిలే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాంతంలో రక్తప్రసరణ బాగా పెరిగి కొవ్వు కరుగుతుంది. అలాగే సైకిలు ఎక్కువగా తొక్కడం వల్ల కూడా ఆ సమస్య అదుపులో ఉంటుంది. ఇంకా బొప్పాయి, క్యారెట్, టొమాటో, చిలగడదుంపలు ఎక్కువగా తినాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు ఈ సమస్యని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.