Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలకెత్తిన పెసళ్లను షాపుల్లో కొనుక్కొచ్చి అలానే తినేస్తే?

మొలకెత్తిన పెసలను తీసుకోవడం ద్వారా దృష్టి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు నయం అవుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. వృద్ధాప్య ఛాయ‌ల‌ను మొలకెత్తిన పెసళ్లు ద‌రిచేర‌నివ్వ‌వు. గ్యాస్‌, అసిడిటీ వంటి

Written By selvi
Updated: గురువారం, 12 అక్టోబరు 2017 (13:35 IST)
మొలకెత్తిన పెసలను తీసుకోవడం ద్వారా దృష్టి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు నయం అవుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. వృద్ధాప్య ఛాయ‌ల‌ను మొలకెత్తిన పెసళ్లు ద‌రిచేర‌నివ్వ‌వు.

గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌ం చేస్తాయి. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను తొలగింటే యాంటీ-ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. 
 
రక్తంలోని చక్కెర స్థాయిలను ఇది అదుపు చేస్తుంది. తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేకూరుతుంది. శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఈ మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉన్నాయి. ఇందులో వుండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా ఒబిసిటీ దూరమవుతుంది. విట‌మిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, వంటివి పోషకాలు వుండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
అయితే షాపుల్లో నుంచి తీసుకొచ్చే మొలకెత్తిన పెసళ్లను నీటిలో శుభ్రం చేసి ఆపై కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాక ఉడికించి పిల్లలకు పెట్టొచ్చు. పెద్దలు మాత్రం నీటిలో శుభ్రపరిచిన పెసళ్లను పచ్చిగానే తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నీటిలో శుభ్రం చేయకుండా పచ్చిగా అలానే వాటిని తింటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం ఉంది.

ఇ-కోలి బ్యాక్టీరియా ఇందులో వుంటాయి. అందుచేత వీటిని పచ్చిగా తింటే తలనొప్పి, వేవిళ్లు వంటి రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. ఇ-కోలీ ద్వారా కిడ్నీకి అంత మంచిది కాదని.. అందుకే ప్యాకేజ్ అయిన ఆహార పదార్థాలను కడిగిన తర్వాతే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments