సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (12:22 IST)

ఢిల్లీలో కాలుష్యం.. వీర్యం విషపూరితం.. సంతాన సాఫల్యతపై దెబ్బ..

ఢిల్లీ నగరం కాలుష్యానికి మారుపేరుగా మారిపోయింది. దీపావళి సందర్భంగా గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరగడం

ఢిల్లీ నగరం కాలుష్యానికి మారుపేరుగా మారిపోయింది. దీపావళి సందర్భంగా గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరగడం ద్వారా ఢిల్లీ వాసులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.

సంతానోత్పత్తి సమస్య ఏర్పడకుండా ఉండాలంటే ఆరుబయటకు వెళ్లేటపుడు కాలుష్యం బారిన పడకుండా బహుళ వడపోత ముసుగులు ఉపయోగించాలని వైద్యులు వెల్లడించారు. కాలుష్య గాలిని పీల్చడం వల్ల పురుషుల వీర్యంలో నాణ్యత దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
వాయు కాలుష్యం కారణంగా వస్తున్న అనారోగ్యాలతో సెక్స్ కార్యకలాపాలు 30 శాతం తగ్గిపోతున్నాయని చేదు వాస్తవం బయటికి వచ్చింది. గాలిలోని కలుషిత లోహాలు, స్త్రీ పురుషుల హార్మోన్లపై ప్రభావం చూపడంతో.. సంతానోత్పత్తి కష్టమవుతోందని నిపుణులు తేల్చేశారు.

గాలిలో ఏర్పడిన నలుసు పదార్ధం, హైడ్రో కార్బన్లు, కాడ్మియం స్త్రీ,పురుషుల హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వీర్యాన్ని విషపూరితం చేస్తాయని వైద్యులు చెప్తున్నారు. వాయు కాలుష్యం ద్వారా టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గిపోవడం వల్ల సెక్స్ కోరిక తగ్గుతుందని నిపుణులు చెప్పారు.