Daily Horoscope
✕

రక్తపోటును బీట్‌రూట్ రసం తగ్గిస్తుందా?

Written By సిహెచ్
Updated: గురువారం, 3 అక్టోబరు 2019 (20:39 IST)
అధిక రక్తపోటు... అదే హైపర్ టెన్షన్. ఇటీవలి కాలంలో ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనికి మాత్రలు వేసుకుంటూ వుంటారు చాలామంది. ఆ సంగతి అలావుంచితే హైపర్ టెన్షన్‌ను సహజసిద్ధంగా తగ్గించేందుకు బీట్ రూట్ రసం ఉపయోగపడుతుందని అంటున్నారు పరిశోధకులు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. 
 
పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, నైట్రేట్‌ సమృద్ధిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉందని వివరించారు.

అన్నీ చూడండి

బిడ్డను అలల వద్ద వదిలేసి రీల్స్ చేసుకున్న తల్లిదండ్రులు.. ఏమైంది? (video)

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం... కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం

బంగాళాఖాతంలో అల్పపీడనం... తమిళనాడులో ఆరెంజ్ అలర్ట్ జారీ

Heavy Rain: బంగాళాఖాతంలో అల్పపీడనం... అక్టోబర్ 23 వరకు ఏపీ భారీ వర్షాలు

హైదరాబాదులో జింకలను వేటాడిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

అన్నీ చూడండి

Shriya Reddy: దసరా నాడు ప్రచండ దేవతగా శ్రీయా రెడ్డి కనిపించిన మహాకాళి పోస్టర్లు

Police Company: డీ కంపెనీ కంటే ప్రమాదకరమైనదిగా రామ్ గోపాల్ వర్మ పోలీస్ కంపెనీ

'ఆదర్శ కుటుంబం' విడుదల తేదీ ఖరారు : వెల్లడించిన మేకర్స్

జైలర్‌పై అభిమానం - థియేటర్ మొత్తం బుక్ చేసిన క్రికెటర్ సంజూ శాంసన్

'వారణాసి' చిత్రం ఓ అందమైన ప్రేమకథ : ఎస్ఎస్ రాజమౌళి

తర్వాతి కథనం
Show comments