గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (21:26 IST)

రక్తపోటు నియంత్రించడం ఎలా? ఈ ఒక్క అరటి పండు తింటే చాలు..

మనం తీసుకునే ఆహారం కూడా రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఆహారంలో అరటి పండు ఒకటి. మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడబోస్తూ అదనంగా వున్న ద్రవాల్ని విసర్జించేలా చేస్తూ శరీరంలోని నీటి శాతాన్ని సమంగా వుంచుతూ వుంటాయి. ఈ విధానం అంతా మన రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. 
 
శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ వుండిపోతే రక్తపోటు పెరిగిపోతుంది. తక్కువ వుంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే. ఇలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చుతగ్గులకు గురికాకుండా కిడ్నీలు సోడియం, పోటాషియం అనే రసాయనాల మధ్య సమతూకాన్ని పాటిస్తాయి. 
 
పొటాషియం ఎక్కువగా నీటిని కిడ్నీల్లోకి చేరవేస్తే, సోడియం నీటిని కిడ్నీల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది. మనం ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ వుండిపోయి రక్తపోటు పెరిగిపోతుంది. ఇలా జరగకుండా వుండాలంటే అలా నిల్వ వున్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం వున్న అరటి పండ్లు తీసుకోవాలి.