గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:02 IST)

రక్తపోటు వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

అధిక రక్తపోటు 'నిశ్శబ్ద హంతకి' పైకి ఎలాంటి లక్షణాలు లేకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది.
 
*అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు తగ్గిపోవచ్చు.
 
*గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావటం వల్ల గుండె పెద్దగా అవ్వచ్చు. దీంతో శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక గుండె చేతులెత్తేయొచ్చు.
 
*రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం తలెత్తొచ్చు. 
 
*మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. బలహీనపడొచ్చు. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడొచ్చు, చిట్లిపోయి రక్తం లీక్ కావొచ్చు. ఫలితంగా పక్షవాతం ముంచుకురావొచ్చు.
 
*రక్తనాళాల లోపలి మార్గం కుంచించుకుపోవటం వల్ల జననాంగాలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా మగవారిలో స్తంభనలోపం తలెత్తొచ్చు, ఆడవారిలో శృంగారాసక్తి సన్నగిల్లొచ్చు.
 
*గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతిని లోపలి మార్గం మూసుకుపోవచ్చు. దీంతో గుండె కండరానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు రావొచ్చు.
మూత్రపిండాల చుట్టురా ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.