కళ్ల చుట్టూ నల్లని వలయాలు... పోగెట్టేదెలా?

సిహెచ్| Last Modified శుక్రవారం, 2 ఆగస్టు 2019 (21:03 IST)
ముఖంలో ఎక్కువగా ఆకర్షించేవి కళ్లు. ఆ కళ్లు అందంగా లేకుండా, కళ్ల కింద ఉబ్బినట్లుగా, నలుపుగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. వీటిని నివారించుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో చూద్దాం.

1. కొన్ని బాదం పప్పులని బాగా నానబెట్టి మెత్తని పేస్టులా చేయాలి. అందులో కొంచెం పాలు కలిపి రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ రాసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే చన్నీళ్లతో కడిగేసుకోవాలి.

2. అధిక ఒత్తిడి, అలసట వల్ల కళ్ల కింద ప్రాంతం వాచినట్లు అవుతుంది. అది పోవాలంటే... వాడేసిన టీ బ్యాగులను బాగా చన్నీళ్లలో ముంచి ఆ వాపు ప్రాంతంలో పెట్టుకుంటే వాపు తగ్గిపోతుంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా సరిపడినంత నిద్ర, పోషకాహారం ఉంటే కళ్లు మిలమిల మెరుస్తాయి.

3. కీరదోస రసం కళ్లకి చాలా మంచిది. అది చర్మానికి మంచి టోనర్‌గా కూడా పని చేస్తుంది. కీరదోస రసంలో దూదిని ముంచి కనురెప్పలపై పెట్టుకోవాలి. కొంచెం రసాన్ని కళ్ల కింద భాగంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

4. టొమాటో గుజ్జుకి కొంచెం నిమ్మరసం, చిటికెడు శనగపిండి, పసుపు కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసుకుని పది నిమిషముల పాటు వదిలేయాలి. రోజుకొకసారైనా ఇలా చేస్తుంటే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు త్వరగా తగ్గుతాయి.దీనిపై మరింత చదవండి :