శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 జులై 2019 (22:21 IST)

తలనొప్పి నివారణకు సహజసిద్ధమైన చిట్కాలు

ఇటీవల కాలంలో ఎక్కువమంది తలనొప్పి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను తట్టుకోలేక తరచూ పెయిన్ కిల్లర్స్‌ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందుల వలన సైడ్ ఎపెక్ట్స్ వస్తున్నాయట. కాబట్టి తలనొప్పి సమస్య నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
 
1. దాల్చినచెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషముల తరువాత వేడి నీటితే కడిగేయాలి.ఇలా చేయడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
 
2. తాజా ద్రాక్షా పండ్లను తీసుకుని జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే సరిపోతుంది.
 
3. అల్లం రసాన్ని కాస్త నిమ్మ రసంలో కలిపి తాగడం వలన తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
 
4. తలనొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్ చేసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వలన రక్తప్రసరణ పెరిగి తలనొప్పి తగ్గుతుంది.