గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2019 (18:30 IST)

తమలపాకు-పచ్చకర్పూరం-వెన్నను కలిపి నమిలితే?

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది కంటి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం సరైన పోషణ అందకపోవడం లేదా కంటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం. కంటి చూపు సమస్యకు మందలు వాడి నయం చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. 
 
సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలతో మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పైగా దుష్ప్రభావాలు కూడా ఏమీ ఉండవు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ లేదా వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. 
 
ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్లు మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. కరివేపాకు కూడా కంటి చూపుకు సహకరిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. 
 
అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కళ్లకు మేలు చేయడంలో పొన్నగంటికూరకు దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం రోజూ ఓ కప్పు తాగించాలి. అలాగే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారట్, టొమాటో వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.